సొంత గూడు చేరిన అల్కా లాంబా

సొంత గూడు చేరిన అల్కా లాంబా

న్యూ ఢిల్లీ: వివాదాస్పద ఆప్ నాయకురాలు అల్కాలంబా శనివారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేత పీసీ చాకో సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కున్నారు. గత సెప్టెంబర్ ఆరున అల్కాలంబా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆప్ నుంచి వైదొల గాల్సిన సమయం ఆసన్నమైందని ట్వీట్ చేసారు. లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఓటమి చెందినపుడు ఆమె పార్టీకి వ్యతిరేకంగా పలు ఆరోపణలు చేశారు. దీంతో ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆమె పై అనర్హత వేటు వేయాలని శాసనససభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.దీన్ని ఢిల్లీ శాసనసభ సభాపతి రామ్ నివాస్ ఆమోదిం చారు. ట్విటర్లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా అనర్హత వేటు వేయటం అన్యాయమని మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా లాలూప్రసాద్ యాదవ్తో దిగిన ఫొటోలు తీసుకువస్తాను ఆయనపై కూడా ఇదేవిధంగా చర్యలు తీసుకుంటారాని ప్రశ్నించారు. లంబా గతంలో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అనంతరం 2014లో ఆప్లో చేరారు. ఇటీవల లోక్సభ ఎన్నికల అనంతరం ఆమె పార్టీపై పలు ఆరోపణలు చేయడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆప్ నేతలు పట్టుబట్టడంతో అనర్హత వేటును ఎదుర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos