తలవంచను గాక వంచను

తలవంచను గాక వంచను

పాట్నా : చాలా సంవత్సరాల తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అందరికీ కనిపించారు. సంస్థ 25 వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా సోమవారం వర్చువల్ వ్యవస్థలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘నేను జైలు జీవితాన్ని గడిపే సమయంలో నా కుమారుడు తేజస్వీ యాదవ్ పార్టీని బ్రహ్మాండంగా నడిపాడు. మా పాలనను ‘జంగిల్ రాజ్ పాలన’ అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. మాది ప్రజా పాలన. ‘రాజకీయంగా నశించవచ్చు కానీ… ఒకరికి నమస్కరించే ప్రసక్తే లేదు. మా పాలనను జంగిల్ రాజ్ పాలన అని విమర్శిస్తారు. పెనంపై ఒకే వైపు ఉన్న రొట్టెలా రాష్ట్రం ఉండేది. ఆ రొట్టె రెండు వైపులా కాలేలా మేము ప్రయత్నించాం. మాది జంగల్ రాజ్ ప్రభుత్వం కాదు. జనుల ప్రభుత్వం. కేవలం కడుపు నింపే ప్రయత్నంలోనే మేం లేము. ప్రజలకు విద్యనందించే ప్రయత్నం కూడా చేశాం. నేను జైలులో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అందుకే ఇబ్బందులు పడ్డాం. అప్పుడు పార్టీ బాధ్యతలు చూస్తానని తేజస్వీ అన్నారు. ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదని భరోసా కల్పించార’ని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావానికి గల కారణాల్ని వివరించారు. కేంద్రం విధానాలపై విరుచుకు పడ్డారు. ‘కరోనా ప్రళయం కంటే పెట్రో ధరలు, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రజల నడ్డి విరుస్తున్నాయి. మా పాలనలో ధరలు ఇంతలా పెరిగితే ప్రజలు తీవ్రంగా విరుచుకుపడేవారు. ప్రస్తుతం అందరూ బలవంతంగా మౌనంగా ఉండి పోతున్నారు. కరోనాను నియంత్రణలో కేంద్రం ఘోరంగా విఫల మైంది. ప్రజలను ఆదుకునే నాథుడే లేడు. బిహార్లో లెక్కలేనన్ని మరణాలు సంభవించాయి. అయినా ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు సామాజిక అంతరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారం కోసం ఏదైనా చేయడానికి వెనకాడటం లేద’ని మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos