ఒకే స్పిన్నరైతే…కుల్‌దీప్‌కే ఛాన్స్…రవి శాస్త్రి

ఒకే స్పిన్నరైతే…కుల్‌దీప్‌కే ఛాన్స్…రవి శాస్త్రి

వెల్లింగ్టన్‌: మణికట్టు మాంత్రికుడు కుల్‌దీప్‌ యాదవ్‌ విదేశీగడ్డపై టీమిండియా ప్రధాన స్పిన్నర్‌గా మారాడని కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. సిడ్నీ టెస్టులో అతడు తీసిన ఐదు వికెట్ల ఘనతను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఇప్పుడు మణిక్టటు స్పిన్నర్లకే ప్రధాన్యం ఉందని అశ్విన్‌, జడేజా కన్నా కుల్‌దీప్‌ ముందున్నాడని శాస్త్రి పేర్కొన్నాడు. ‘ఇప్పటికే కుల్‌దీప్‌ ప్రధాన స్పిన్నర్‌! విదేశీగడ్డపై ఆడుతున్నాడు. ఐదు వికెట్ల ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై ప్రధాన బౌలర్‌గా అవతరించాడు. మేం ఒక స్పిన్నర్‌తోనే బరిలోకి దిగాల్సి ఉంటే తొలి ప్రాధాన్యం అతడే. మిగతా వారికీ అవకాశం ఉంది. కానీ కుల్‌దీప్‌ అందరికన్నా ముందున్నాడు. టెస్టుల్లో అతడి బౌలింగ్‌ సంతృప్తికరంగా ఉంది’ అని రవిశాస్త్రి అన్నాడు. టీమిండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా స్టాన్స్‌ను  కొద్దిగా మార్చేశామని రవిశాస్త్రి అన్నాడు. క్రీజులో నిలబడే విధానాన్ని మాత్రమే కాస్త మార్చామని తెలిపాడు. ఇప్పుడొస్తున్న ఫలితాల కోసం మళ్లీ పుజారాను ఒక మ్యాచ్‌లో తప్పించేందుకు తాను సిద్ధమని వెల్లడించాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ తర్వాత అతడిని విశ్రాంతి తీసుకోవాలని సూచించామన్నాడు. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ తనకు సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ను గుర్తుచేస్తున్నాడని శాస్త్రి వెల్లడించాడు. రోజురోజుకు అతడి నాయకత్వ ప్రతిభ మెరుగవుతుందని పేర్కొన్నాడు. టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను అతడు తెలివిగా బోల్తా కొట్టించాడని రవిశాస్త్రి అన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos