కృష్ణా … నీరు సముద్రం పాలు

కృష్ణా … నీరు సముద్రం పాలు

అమరావతి : ఎగువ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు నిండుతాయా అనే సంశయం మొన్నటి దాకా ఉండేది. ఇప్పుడా సంశయం వీడడమే కాదు అన్ని ప్రాజెక్టులూ నిండిపోయి కృష్ణా నది నీరు సముద్రంలో కలసిపోతోంది. నాగార్జున సాగర్‌లో మంగళవారం రాత్రి 8.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. 26 క్రెస్ట్‌ గేట్లను ఎత్తివేసి 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల నుంచి నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా ప్రకాశం బ్యారేజీ వైపు విడుదల చేశారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల వద్ద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. తుంగభద్రకు కూడా తక్కువైంది. ఎగువన పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువ కావడంతో కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తోంది. అక్కడ 70 గేట్లను ఎత్తివేసి లక్షన్నర క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. క్రమంగా ఈ  పరిమాణం మూడు లక్షల క్యూసెక్కులకు పెరగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos