కృష్ణమ్మ పరవళ్లు

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రెండు లక్షలా 41 వేలా 945 క్యూసెక్కుల నీరు చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 871.30 అడుగుల మేర నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 147.27 టీఎంసీలు. జలాశయం నుంచి 82,925 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 510.60 అడుగులు.  పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 132.69 టీఎంసీలు. జలాశయంలోకి 55,554 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుండగా 858 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos