‘కోటంరెడ్డి’ అరెస్టుకు తెదేపా డిమాండు

‘కోటంరెడ్డి’ అరెస్టుకు తెదేపా డిమాండు

అమరావతి: పాత్రికేయుణ్ని బెదిరించిన నెల్లూరు గ్రామీణ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. పాత్రికేయుణ్ని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరించినట్లుగా భావిస్తున్న ఆడియో క్లిప్ ను ప్రదర్శించారు.‘ కోటం రెడ్డి కచ్చేరీలో పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులకు కూడా నట్లు టైట్ చేస్తార’ని ఆరోపించారు. ‘నట్లు బిగించడానికి వాళ్లు ఏమైనా యంత్రాలా?’ని ప్రశ్నించారు. కోటం రెడ్డి కచ్చేరీ ఒక ‘డెన్’ అని వ్యాఖ్యానించారు. ప్రతీ పౌరుడిని రక్షించాలనే బాధ్యతను మరచి పోయిన హోం మంత్రి మేక తోటి సుచరిత ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ శాసనసభ్యులందరూ ఎమ్మెల్యేలు అందరూ సంతోషంగా ఉండేలా చూడాలని కలెక్టర్ల సమావేశంలో జగన్ చెప్పటం సరైంది కాదన్నారు. ఆయన చేసిన సూచనతో వైకాపా శాసనసభ్యులు రెచ్చిపోయి. తామే రారాజులం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos