కోదండరాం మొదలెట్టాడు..

కోదండరాం మొదలెట్టాడు..

తెలంగాణలో ఇంటర్‌ మంటలు ఇప్పట్లో చల్లారేలలా కనిపించడం లేదు.తమ
ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటున్నందుకు కాంగ్రెస్‌తో పాటు,ఎన్నికల్లో చిత్తుచిత్తుగా
ఓడించినందుకు తెరాస అధినేత కేసీఆర్‌పై టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అవకాశం ఎదురు
చూస్తున్న క్రమంలో వెలుగు చూసిన ఇంటర్‌ ఫలితాల అవకతవకలు కాంగ్రెస్‌,కొదండరామ్‌లకు అస్త్రాలుగా
దోరికాయి.ఈ నేపథ్యంలో ఇంటర్ అవకతవకను అవకాశంగా చేసుకొని టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టేందుకు రెడీ అయ్యారు. స్వతహాగా ప్రొఫెసర్ అయిన కోదండరాం ఇప్పుడు అదే విద్యార్థుల సమస్యలపై పోరుబాటు పట్టి తమను ఎన్నికల్లో ఓడించిన కేసీఆర్ కు షాకివ్వాలని పెద్ల ప్లానే వేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఎల్లుండి ఇంటర్ అవకతవకలపై మహాధర్నాకు పిలుపునిచ్చాడు. ఇంటర్ బోర్డ్ వద్ద చేపట్టే ఈ ధర్నాకు జెండాలు పక్కనపెట్టి అన్ని పార్టీలు కదిలిరావాలని పిలుపునిచ్చాడు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇంటర్ ఫలితాలు-దోషులు-పరిష్కారం’ అనే అంశంపై టీజేఎస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సమావేశం నిర్ణయించింది. ఇంటర్ బోర్డ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ తప్పులు దొర్లాయని కోదండరాం మండిపడ్డారు.ఇక ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్ సైతం 23మంది విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కారణమైన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మేధావులు వివిధ సంఘాల నాయకులు పాల్గొని ఇంటర్ అక్రమాలపై ఎల్లుండి ఇంటర్ బోర్డు ఎదుట మహాధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇలా ఇంటర్ లొల్లిలో అడ్డంగా దొరికిన కేసీఆర్ ను ఇరుకునపెట్టేందుకు కేసీఆర్ అందిరినీ కూడగడుతుండడం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos