బాలయ్య ఆటలో అరటి పండు

బాలయ్య ఆటలో అరటి పండు

విజయవాడ : నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాల్ని పెద్దగా పట్టించుకోనని మంత్రి కొడాలి నాని ఒక దృశ్య మాధ్యమం ముఖాముఖిలో పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తులో ఉంటారని, ఆయన కుమారుడిగా పుట్టి, తండ్రికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు వంటి వ్యక్తి వెంట కార్యకర్తలా బాలయ్య తిరుగుతున్నా ఒకవేళ నా తండ్రికి కనుక ఎన్టీఆర్కు జరిగినట్లు అవమానం చేసి పార్టీ, పదవిని లాక్కుంటే.. నేనేంటో చూపించేవాడిని. . బాలయ్య ఆటలో అరటిపండు లాంటి వాడు. ఆయన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక తెదేపా కార్యాధ్యక్ష పదవి కావాలని బాలయ్య అడుగుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం గురించి నాకు తెలియదు. ఒక వేళ అడిగితే పదవి ఇచ్చెయొచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఏముంది.. ప్రెసిడెంట్ పదవే అడగొచ్చు. తండ్రి పార్టీ కాబట్టి ఆయన స్థాయికి పదవి అడగొచ్చు’ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos