బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్​ రాజధాని

బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్​ రాజధాని

కీవ్ : నాలుగు నెలల విరామం తర్వాత రాజధాని నగరం కీవ్, ఇతర నగరాల పై రష్యా సోమవారం దాడులకు దిగింది. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న లివివ్ నగరంలో కీలక మౌలిక సదుపాయాలపై రష్యా రాకెట్లతో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. గత కొద్ది రోజులుగా క్రిమియాకు ఉత్తర ప్రాంతం, జపోరిజియాలోనే రష్యా-ఉక్రెయిన్ సేనల మధ్య భీకర పోరు జరుగుతోంది. జపోరిజియాపై రష్యా ఆదివారం క్షిపణుల వర్షం కురిపించింది. కీవ్ గత కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉంది. ఇటీవల రష్యా-క్రిమియాను కలిపే ప్రధాన వంతెనపై జరిగిన పేలుడు యుద్ధ తీవ్రతను పెంచింది. దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దాడి వెనక ఉక్రెయిన్ ప్రత్యేక దళాల హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రష్యా దర్యాప్తు ప్రారంభించినట్లు పుతిన్ తెలిపారు. అందుకు ప్రతీకారంగానే నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా క్షిపణుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.రష్యా-క్రిమియాను కలిపే కెర్చ్ రోడ్డు, రైలు వంతెనపై శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ వంతెనపై ట్రక్కు బాంబు పేలడంతో అటుగా వెళ్తోన్న ఆయిల్ ట్యాంకర్ల రైలుకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం జరిగినట్లు రష్యా వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 70వ పుట్టినరోజు చేసుకున్న.. మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు తర్వాత రష్యా ప్రతీకారంతో రగిలిపోతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos