కియ విడుదల

కియ విడుదల

అనంతపురం: పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా కర్మాగారంలో తయారైన తొలి కారును మంత్రులు బుగ్గన, శంకర నారాయణ, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వాడల మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ఛేర్ పర్సన్‌ రోజా గురువారం ఇక్కడ లాంఛనంగా విడుదల చేసారు. రాయలసీమలో పరి శ్రమల అభివృద్ధికి, కియా మోటార్స్‌కు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా రోజా తెలిపారు. కియాలో 75 శాతం ఉద్యోగాల్ని స్థానికు లకే ఇవ్వాల కోరారు. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని బుగ్గన అన్నారు.అంతర్జాతీయ ప్రమా ణాలు, సాంకేతికతతో కార్లు తయారు చేసినట్ల కియా ప్రతినిధి భట్ తెలిపారు. ఏటా మూడు లక్షల కార్లు తయారు చేస్తామన్నారు. గత మూడు వారాల్లో 25 వేల కార్లు బుకింగ్ అయ్యాయన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos