రైతుల ఆందోళనలకు కేజ్రీవాల్ మద్దతు

న్యూ ఢిల్లీ : రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంఘీ భావాన్ని తెలిపారు. సోమవారం సహచరులతో కలిసి హర్యానా – ఢిల్లీ సరిహద్దులోని రైతులను కలుసుకోనున్నారు. అక్కడ కల్పించిన ఏర్పాట్లను స్వయంగా సమీక్షించనున్నారు. రైతుల్ని పరామ ర్శించిన తొలి ముఖ్యమంత్రి ఆయనే. మంగళవారం తలపెట్టిన భారత్ బంద్ కూ ఆయన మద్ధతు ప్రకటించారు. ‘ఢిల్లీ-హర్యానా సరిహద్దులో రైతుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సౌకర్యాలను కల్పించింది. 8న జరగనున్న భారత్ బంద్ కు ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా మద్దతిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ఆప్ కార్యకర్తలు శాంతియుతంగా తమ నిరసనలు తెలుపుతారు. రైతుల నిరసనలకు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరు తున్నా న’ని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. నగర సరిహద్దులోని సింఘు, ఘాజీపూర్ టిక్రీ ప్రాంతాల్లో వేలాదిగా చేరిన రైతులు, తమను ఢిల్లీలోకి అనుమతించాలని నిరసనలు కొనసాగిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos