భాజపాకు దేశం కంటే ఓట్లే ముఖ్యం

భాజపాకు దేశం కంటే ఓట్లే ముఖ్యం

న్యూఢిల్లీ: దేశానికి ఏమైనా ఇవ్వాలని భారతీయ జనతాపార్టీ ఎప్పుడూ ఆలోచించదని, దానికి ఓట్లు మాత్రమే కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ధ్వజమెత్తారు. ‘భారతీయ జనతాపార్టీ దేశ వికాసం కోసం ఎప్పుడూ ఆలోచించదు. ఈ దేశంలో విద్య గురించి, పేదరికం గురించి, ఉద్యోగ కల్పన గురించి ఎప్పుడూ మాట్లాడదు. కానీ, ఓట్ల గురించి మాట్లాడుతుంది. భాజపాకు ఓట్లు మాత్రమే కావాలి. ఇలాంటి వాళ్లు అప్పుడు అప్పుడు నీతులు కూడా చెబుతారు’అని మంగళ వారం ట్వీట్‌లో  మండి పడ్డారు.  ‘ఇప్పటి వరకు ప్రజలు ప్రధానిని ఎన్నుకోవడానికి ఓటేశారు. ఢిల్లీ ఓటర్లు ఈ సారి రాష్ట్ర వాదంపై ఓటే యడానికి సిద్దమయ్యారు’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు.  నెహ్రూపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కేజ్రివాల్ ఖండించారు. నెహ్రూ ఎన్నో సంస్థలను నెలకొల్పి విద్యావంత, విజ్ఞానవంత దేశాన్ని తీర్చిదిద్దారని, నరేంద్ర మోదీ ఆ సంస్థలను విధ్వంసం చేశారని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos