కీర్తి సురేష్ అవంటే అంత భయమా ?

  • In Film
  • November 16, 2020
  • 127 Views
కీర్తి సురేష్ అవంటే అంత భయమా ?

కీర్తి సురేష్ దీపావళి వేడుకలకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో,ఫోటోలు నెటిజెన్స్ నవ్వుకునేలా చేశాయి. కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసిన కీర్తి సురేష్ ఆ ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దివాళి రోజున మార్నింగ్ సెలబ్రేషన్స్ అంటేనే అదో రకమైన సాహసంతో కూడుకున్నవి అంటూ అక్కడ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఆ వీడియోలో తన కుటుంబసభ్యులతో కలిసి పటాసులు కాలుస్తూ ఎంజాయ్ చేసిన కీర్తి సురేష్.. ఒకానొక సందర్భంలో ఒక చిన్న పటాసును కాల్చడానికి నానా తంటాలు పడటం వీడియోలో చూడొచ్చు. ఆ పటాసు అంటుకోకముందే భయంతో అక్కడి నుంచి పరుగెత్తడం, మళ్లీ వచ్చి కాల్చేందుకు ప్రయత్నించడం.. అలా ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. పదేపదే అదే రిపీట్ అవడంతో ఆ వీడియో చూసిన నెటిజెన్స్ కీర్తి సురేష్ ఇంత భయస్తురాలా అని నవ్వుకుంటున్నారు.

https://www.instagram.com/p/CHlGHmDpsp1/?utm_source=ig_web_copy_link

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos