వరదరాజ స్వామి గుడిలో కేసీఆర్

వరదరాజ స్వామి గుడిలో  కేసీఆర్

కంచి : కాంచీపురంలోని అత్తి వరదరాజ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సోమవారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి బేగంపేట విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచికి వెళ్లారు. మార్గమధ్యంలో నగరిలో ఆయనకు ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే. రోజా స్వాగతం పలికారు. కంచి ఆలయంలో అధికారులు, వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, కుమార్తె, మాజీ ఎంపీ కవిత, రోజా ప్రభృతులు ఉన్నారు. కాంచీపురం నుంచి తిరిగి వచ్చి కేసీఆర్‌ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్‌కు వెళతారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos