కేసీఆర్‌ కేబినెట్‌లో తొలి మహిళా మంత్రి ఎవరో?

ఎన్నికల ఫలితాలు వెలువడ్డ సుమారు 70 రోజులకు పది మంది ఎమ్మెల్యేలతో
మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కేసీఆర్‌ గతంలో ఎదుర్కొన్న విమర్శలనే రెండవసారి కూడా ఎదుర్కొంటున్నారు.గత
మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా మంత్రిపదవి ఇవ్వని కేసీఆర్‌ రెండవసారైనా మంత్రివర్గంలో
మహిళలకు మంత్రిపదవి ఇస్తారని అంతా భావించారు.అయితే ఇటీవల పది మంది ఎమ్మెల్యేలతో చేపట్టిన
మంత్రివర్గ విస్తరణలో కూడా మహిళలకు అవకాశం ఇవ్వకపోవడంతో మహిళలకు కేసీఆర్‌ ప్రాధాన్యత
ఇవ్వడం లేదంటూ గతంలో వచ్చిన విమర్శలు మరోసారి వినిపించాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేబినేట్ లోనైనా మహిళలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన కేసీఆర్ తరువాతి విస్తరణలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామన్నారు. వీటన్నింటిని
దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్‌ తదుపరి మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మహిళలకు మంత్రి
పదవులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.దీంతో అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నెలకొంది.ఇటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చెప్పిన ఎమ్మెల్యేల్లో ఏపార్టీకి చెందిన వారికి అవకాశం ఇస్తారోనని రకకాలుగా చర్చించుకుంటున్నారు. టీఆర్ ఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు – ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే టీఆర్ ఎస్ లోని నలుగురిలో ఇద్దరికి మంత్రిపదవి ఇస్తారా..? లేక కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరికి పార్టీలోకి చేర్చుకొని కేబినేట్ లోకి తీసుకుంటారా..? అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి – సీతక్కలు సీనియర్ నాయకులు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి గులాబీ కండువా కప్పి మంత్రి పదవి ఇస్తారని కాంగ్రెస్ లో చర్చించుకుంటున్నారు.సహజంగా ముఖ్యమంత్రి కేబినేట్ ప్రకటన చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ జరగాలి. కానీ ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేల మధ్య కామెంట్లు రావడం చర్చనీయాంశంగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos