హైదరాబాద్‌కు దరిద్రపు రోజులు వచ్చేశాయ్..

హైదరాబాద్‌కు దరిద్రపు రోజులు వచ్చేశాయ్..

 ఏదైనా విషయం మాట్లాడాలన్నా ఎవరినైనా పొగడాలన్నా,విమర్శించాలన్నా,తిట్లతో విరుచుకుపడాలన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మించినోళ్లు లేరనే చెప్పుకోవాలి.ఎవరు ఏమనుకున్నా సరే తనకు అనిపించింది తాను అనాల్సింది అనేసే నైజమున్న కేసీఆర్‌ తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంపై చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.ఒకప్పటి హైదరాబాద్‌కు ఇప్పటి హైదరాబాద్‌కు అసలు పొంతనే లేదని అప్పటి నగరంతో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్‌ దరిద్రంగా,ప్రమాదకరంగా మారిందంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను చిన్నప్పుడు హైదరాబాద్ కు వస్తే చల్లగా ఉండేదని.. ఒకప్పుడు హైదరాబాద్ కు వస్తే తెల్లగా మారేటోళ్లని.. బంజారాహిల్స్ లో ఫ్యాన్ అవసరం లేదని.. అలాంటి నగరం కాస్తా రోజున ఏసీ లేనిదే ఉండలేని పరిస్థితి ఉందన్నారు. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారిందన్న ఆవేదనను వ్యక్తం చేశారు.బంజారాహిల్స్ లో ఆక్సిజన్ క్లబ్బులు తెరిచారని.. మంచి గాలిని కొనుక్కుంటున్నారని.. అలాంటి దరిద్రపు రోజులు వచ్చేశాయన్నారుదంతా బాగానే ఉందికానీ హైదరాబాద్‌ ఇంత దరిద్రంగా తయారైందని తెలిసి కూడా ఈ ఐదారేళ్లలో హైదరాబాద్‌లో మార్పులు తీసుకురావాలనే ధ్యాస ఎందుకు రాలేదో మన కేసీఆర్‌కు.ఎంతసేపూ ప్రాజెక్టులు,ఫ్యాక్టరీలు,నీళ్లు అంటూ కలవరించే కేసీఆర్‌ హైదరాబాద్‌లో మాయమైన పచ్చదనాన్ని పెంపొందించి హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకురావడంపై ఎందుకు ధ్యాస కనబరచడం లేదో మరి.అభివృద్ధి చెందిన రాష్ట్రమంటే కేవలం డబ్బులు,నీళ్లు,ఫ్యాక్టరీలు ఉంటే సరిపోదు పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడగలిగే పచ్చదనం కూడా ఉండాలని కేసీఆర్‌కు గుర్తుందో లేదో!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos