ట్రబుల్ షూటర్‌ కే ట్రబుల్స్…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ప్రారంభమైన రోజు నుంచి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక తెలంగాణ రాష్ట్ర శాసనసభకు రెండసారి జరిగిన ఎన్నికల్లో తెరాసను అధికారంలోకి తీసుకువచ్చే వరకు కేసీఆర్‌ అనంతరం హరీశ్‌రావ్‌ కూడా ఎంతో కీలకపాత్ర పోషించారు.ముందస్తు ఎన్నికలు జరిగినంత వరకు తెరాసలో హరీశ్‌రావుకు ప్రాధాన్యత దక్కుతూ వచ్చింది. అయితే ఎన్నికల్లో తెరాస గెలిచిన అనంతరం హరీశ్‌రావుకు పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిందని కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే హరీశ్‌రావును దూరం పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రానున్న రోజుల్లో కేంద్రంలో చక్రం తిప్పడానికి సిద్ధమవుతున్న కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లో నిమగ్నమయ్యారు.కేంద్రంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అనంతరం కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు వినిపించాయి ఇప్పటికీ వినిపిస్తున్నాయి.కేసీఆర్‌ కేంద్రానికి వెళితే హరీశ్‌రావు కేసీఆర్‌కు తోడుగా ఉంటారని కేసీఆర్‌ అన్ని వ్యవహారాలు హరీశ్‌రావే స్వయంగా పర్యవేక్షిస్తారని అనుకున్నారు.అయితే అటువంటిదేమి లేదని తెలుస్తోంది.అతిత్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలను కూడా కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షించనున్నట్లు సమాచారం.ముఖ్యంగా ఖమ్మం, మెదక్‌,జహీరాబాద్‌ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్‌ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారాలు,సహరించే నేతలు ఇలా అన్ని పనులు తనే స్వయంగా చూసుకోనున్నట్లు సమాచారం.ఇక మిగిలిన అన్ని నియోజకవర్గాలకు కూడా మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించిన కేసీఆర్‌ హరీశ్‌రావుకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు.దీంతో కేసీఆర్‌ ఉద్దేశ్వపూర్వకంగా హరీశ్‌రావుకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ హరీశ్‌రావును పార్టీలో డమ్మీ చేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలకు కేసీఆర్‌ తీసుకున్న చర్యలు మరింత బలాన్ని చేకూర్చాయి.దీనిపై కేసీఆర్‌,హరీశ్‌రావులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos