బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరు

బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరు

హైదరాబాదు : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగానికి కానీ, ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా కానీ సభకు కేసీఆర్ రాలేదు. ఈరోజు బడ్జెట్ సందర్భంగానైనా ఆయన వస్తారని భావించినప్పటికీ… ఆయన రావడం లేదనే సమాచారం అందింది. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగసభ ఏర్పాట్లపై కీలక నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ప్రస్తుతం బంజారాహిల్స్, నంది నగర్ లోని తన నివాసంలోనే ఉన్నారు.

తాజా సమాచారం