కేసీఆర్ చాతిలో ఉన్న‌ది గుండెనా?  లేక బండ‌రాయా?

హైదరాబాదు:  ‘ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో ముందుండి పోరాటం చేసిన వారు విద్యార్థులు. అలాంటిది ఈ రోజు వారు ఉద్యోగాలు లేక ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నారు. ఉద్యోగాల‌ నోటిఫికేష‌న్  కోసం ఎదురు చూస్తున్నారు. చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు’ అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ నిరాహార దీక్ష ఆరంభించిన తర్వాత ప్రసంగించారు.’మొన్న సునీల్ నాయ‌క్ కాక‌తీయ యూనివ‌ర్సిటీలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న చావు త‌ర్వాత‌యినా నోటిఫికేష‌న్లు రావాల‌ని చెప్పాడు. త‌న త‌ల్లిదండ్రుల‌కు భారమ‌వుతున్నాన‌ని సిరిసిల్ల‌లో మ‌హేంద‌ర్ యాద‌వ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. న‌ల్ల‌గొండ‌లో సంప‌త్ కుమార్ త‌న‌కు ఉద్యోగం వస్తుంద‌న్న ఆశ పోయింద‌ని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు.  ‘ఇలా ఒక్కొక్క‌రి గురించి చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. ఇంత జ‌రుగు తున్నా  దున్న‌పోతు మీద వాన ప‌డిన‌ట్లు కేసీఆర్ గారిలో మాత్రం చ‌ల‌నం లేదు. కేసీఆర్ గార ఉద్యమం నాడు అన్న‌మాట ఏంటీ? చ‌ంద‌మామ లాంటి మ‌న పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని.  మ‌రి ఇప్పుడు చంద‌మామ లాంటి పిల్ల‌లు చ‌నిపోతుంటే కేసీఆర్ గారికి క‌నిపించ‌డం లేదా? ఇంట్లో గ‌డి వేసుకుని నిద్ర‌పోతున్నారా?’ ‘అస‌లు కేసీఆర్ చాతిలో ఉన్న‌ది గుండెనా?  లేక బండ‌రాయా? ల‌క్షా 91 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంది. ఎందుకు భ‌ర్తీ చేయ‌ట్లేదు?  కేసీఆర్ గారు స‌మాధానం చెప్పాలి. ఏ ఇత‌ర పార్టీ పోరాటం చేసినా చేయ‌క ‌పోయినా.. యువ‌తకు మ‌ద్దతుగా మేము నిల‌బ‌డ‌తాం. వందల మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే అందుకు బాధ్యులు ఎవ‌రు. కేసీఆర్ క్ష‌మా ప‌ణ‌లు చెప్పాలి. ఉద్యో గాలు భ‌ర్తీ చేయాలి. నేను 72 గంట‌లు నిరాహార దీక్ష  చేస్తాను. నాలుగో రోజు నుంచి జిల్లాల్లోనే మా నాయ‌కులు దీక్ష‌లు చేస్తుంటారు. ఉద్యోగాలు భ‌ర్తీ చేసేంతవ‌ర‌కు మా పోరాటం కొన‌సాగుతూనే ఉంటుంది’ ప్ర‌భుత్వం నిద్ర‌లేవాల’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos