కావూరి చూపు వైసీపీ వైపు!

కావూరి చూపు వైసీపీ వైపు!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ వలసలు క్రమంగా ఊపందుకుంటున్నాయి.కాంగ్రెస్‌,బీజేపీ పార్టీల్లోకి వలసలు ఏమాత్రం లేకపోగా వైసీపీ,జనసేన పార్టీల్లోకి వలసలు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటున్నాయి.ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్షం వైసీపీలోకి కొద్ది రోజులుగా వలసలు భారీగా ఉంటున్నాయి.ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ వైసీపీలో చేరగా చాలా నియోజకవర్గాల్లో బలమైన నేతలు వైసీపీలో చేరారు.ఇదే బాటలో మరికొంత మంది ఎమ్మెల్యేలు,ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో మరో సీనియర్‌ నేత,కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కూడా వైసీపీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రస్తుంత బీజేపీలో నేతగా కొనసాగుతున్న కావురి వైసీపీలో చేరడానికి ఆసిక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.ఇ ప్పటికే వైసిపి కీల‌క విజ‌య సాయిరెడ్డితో మంత‌నాలు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ తో భేటీకి రంగం సిద్ద‌మైంది.గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి అయిదు సార్లు ఎంపీగా గెలిచారు. 1984, 1989, 1994 సంవత్సరాల్లో మ‌చిలీప‌ట్నం లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వరసుగా గెలుపొందిన కావూరి సాంబ‌శివ‌రావు ఆ త‌రువాత 2004,2009 లో ఆయ‌న ఏలూరు లోక్‌స‌భ నుండి గెలిచారు. 2014 లో రాష్ట్ర విభ‌జ‌న కు ముందుగా ఆయ‌న‌కు యూపిఏ ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు కేంద్రంలో క్యాబినెట్ ప‌ద‌వి ద‌క్కింది. అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కాంగ్రెస్ ఎంపీగా ఉం టూనే స‌మైక్యాంధ్ర నినాదాన్ని బ‌లంగా వినిపించారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భాజాపా లో చేరారు. ప్ర‌స్తుతం ఏపిలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆయ‌న బిజెపిని వీడి వైసిపి లో చేరాల‌ని భావిస్తున్నారు.మరోసారి ఏలూరు ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న కావూరు ఎంపీ సీటుపై హామీ దక్కితే వైసీపీలో చేరతాననే షరతు పెట్టినట్లు సమాచారం.వైసిపి నుండి 2014 ఎన్నిక‌ల్లో ఏలూరు లోక్‌స‌భ స్థానం నుండి పోటీ చేసిన తోట చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం జ‌న‌సేన లో ఉన్నారు. ఇక‌, టిడిపి నుండి మాగంటి బాబు బ‌రిలో ఉన్నారు.ఈ సారి టిడిపి ఎంపీగా మాగంటి బాబు పోటీ చేస్తారా..లేకే ఆయ‌న ఎమ్మెల్యేగా బ‌రిలో నిలుస్తారా అనేది క్లారిటీ లేదు. దీంతో..ఏలూరు లో ప‌ట్టు ఉన్న కావూరి సాంబ‌శివ‌రావు వైసిపిలోకి వ‌స్తే..అక్క‌డ సామాజిక స‌మీక‌ర‌ణాల్లో భాగంగా ఆ లోక్‌స‌భ సీటు గెలవ చ్చనే అంచ‌నా లో వైసిపి ఉంది. కావూరు సాంబ‌శివ‌రావును వైసిపిలోకి తెచ్చేందుకు ద‌గ్గుబాటి వేంక‌టేశ్వ‌రావు కీల‌క భూమిక పోషిస్తున్నారు. ఒక‌టి లేదా రెండు రోజుల్లోనే ఆయ‌న వైసిపిలో చేర‌టం ఖాయ‌మ‌ని పార్టీ నేత‌లు చెబుతు న్నారు. కావూరు చేరిక ద్వారా టిడిపికి అండ‌గా నిలిచే బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం లోని కీల‌క నేత‌లు వైసిపి వైపు ఆక‌ర్షితు ల‌వ్వ‌టం ఇక ర‌కంగా టిడిపికి న‌ష్టంగానే భావించాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos