జ‌గ‌న్ పై కావాల‌ని దాడి చేయ‌లేదు

జ‌గ‌న్ పై కావాల‌ని దాడి చేయ‌లేదు

రాజమహేంద్రవరం: వైకాపా అధినేత జగన్ పై కోడి కత్తితో దాడిచేసి గాయపరిచిన నిందితుడు శ్రీనివాస్ ఇక్కడ కేంద్ర కారాగారం నుంచి శనివారం బెయిలుపై విడుదలయ్యారు. కారాగారం వెలుపల విలేఖరులతో మాట్లాడారు. ‘నేను విమానాశ్రయం హోటల్ లో వంట పని చేస్తున్నా. ఆ రోజు అక్కడ ప్రజా సమస్యల గురించి జగన్ తో మాట్లాడేందుకు వెళ్లాను. అప్పుడు తన చేతిలోని కత్తి ప్రమాద వశాత్తు ఆయనకు తగిలింది. కంగారులో, పొరపాటున నా చేతిలో కత్తి ఆయనకు గుచ్చుకున్న మాట వాస్తవమేన’ని స్పష్టీకరించాడు. ఆ సమయంలో తన జేబులో కత్తి, ఫోర్క్, పేనా చిందరవందరయ్యాయని చెప్పారు. జగన్ కు ఏం తగిలిందో అన్న విషయం కూడా తనకు తెలియదని చెప్పాడు. ఇప్పుడు తాను ప్రాణాలతో ఉన్నానంటే దానికి జగనన్నే కారణమన్నాడు. ‘జగన్ది జాలి గుండె. ఆ సమయంలో తనను ఇతరులు కొట్టకుండా అడ్డుకున్నార’ని వివరించారు. ఏడు మాసాల కిందట శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos