చినజీయర్ ఆశ్రమంలో యడ్డీ ప్రత్యేక పూజలు..

చినజీయర్ ఆశ్రమంలో యడ్డీ ప్రత్యేక పూజలు..

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హైదరాబాద్‌లో చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువారం రాత్రి బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న యడ్డీ.. నేరుగా ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు.అనంతరం శుక్రవారం తెల్లవారుజామున శ్రీ యాగంలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.యెడ్డీ రాకపై చినజీయర్ శిష్యుడు, మైహోమ్స్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు మాట్లాడుతూ.. యడియూరప్ప సీఎం అయిన సందర్భంగా చినజీయర్ ఆశీర్వాదాలు తీసుకున్నారని.. ఆశ్రమం ప్రాంగణంలో శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నారని తెలిపారు.కేబినెట్ విస్తరణ తర్వాత మరోసారి దర్శనానికి వస్తానని చెప్పినట్లుగా రామేశ్వరరావు వెల్లడించారు. శ్రావణమాసం ఆరంభమవుతున్న సందర్భంగా మంగళ శాసనాలు చేస్తున్నామని.. ఈ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయని.. శ్రావణ మాసం వస్తూ వస్తూనే వానలు తీసుకొచ్చిందని తెలిపారు.ఇక మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న యడియూరప్ప ఆశావహుల జాబితాను అధిష్టానానికి అందించినట్లు తెలుస్తోంది.అధిష్టానం నుంచి అనుమతి లభించిన అనంతరం రెండు విడతల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.మొదటి విడతలో బీజేపీ నేతలకు స్థానం కల్పించనుండగా రెండవ విడతలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ సుప్రీంకోర్టులో ఉండడంతో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రెండవ విడత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos