కనుమరుగైన కర్నాడ్‌

కనుమరుగైన కర్నాడ్‌

బెంగళూరు: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ రంగస్థల నటుడు, నాటక రచయిత, సినీ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు గిరీశ్ కర్నాడ్(81) సోమవారం ఉదయం ఇక్కడ అస్తమించారు. దీంతో కన్నడ సాహిత్యం, దేశ నాటక రంగంలో ఒక ప్రముఖ అధ్యాయం ముగిసి నట్లయ్యింది. మహారాష్ట్రలోని మాతేరన్ లో 1938 మే 19న జన్మించిన గిరీశ్ కర్నాడ్, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడ్డారు. చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం 6.30 గంటలకు సొంత నివాసంలో సమయంలో కన్నుమూసారు. తెలుగులో గిరీశ్ కర్నాడ్ ధర్మచక్రం, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, ప్రేమికుడు, ఆనంద భైరవి, రక్షకుడు తదితర చిత్రాల్లో నటించారు. 1972లో గిరీశ్ కర్నాడ్ కు బీవీ కారంత్ తో కలిపి ‘వంశ వృక్ష’ అనే కన్నడ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డును అందుకు న్నారు. రచయితగా అత్యంత ప్రతి ష్టాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. ఆయన సాహిత్య, నాటకం, సినీ, టీవీ రంగాలకు అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది.దూర దర్శన్ కోసం నెహ్రూ రాసిన డిస్కవరి ఆఫ్ ఇండియాను బుల్లి తెరకు ఎక్కించారు. నాలుగు దశాబ్ధాల జీవితంలో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. నాలుగు ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. తెలుగులో ‘ధర్మచక్రం’, ‘శంకర్ దాదా ఎంబీ బీఎస్’, ‘కొమరం పులి’ చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా కన్నడ, హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషిం చారు. హిందిలో చివరిగా ఆయన సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై చిత్రంలో రా చీఫ్ గా నటించారు. కన్నడలో చివరిగా నటించిన చిత్రం అప్నా దేశ్ వచ్చేఆగస్టు 26న విడుదల కాబోతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos