ఆజం ఖాన్‌పై మరో కేసు

ఆజం ఖాన్‌పై మరో కేసు

రాంపూర్: ఇక్కడి శహబాద్‌లో గత గురు వారం జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కార్గిల్‌ యుద్ధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేరానికి సమాజవాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్, మరో ఇద్దరికి వ్యతిరేకంగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు శనివారం ఇక్కడ తెలిపారు. ‘కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ను ఓడించేందుకు భారతీయ సైనికులు (హిందూ-ముస్లింలు) రాజీ పడ్డారు. పాకిస్థానీయులను తప్పుదారి పట్టించేందుకు ‘నార-ఇ-తక్బీర్ అల్లాహు అక్బర్’ అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాల్ని తమ సొంత సైనికులే చేశారని భావించిన పాక్ సైనికులు బయటకు వచ్చారు. దాంతో భారత సైనికులు వారిని తేలిగ్గా ఓడించారు’అని ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. ఆజంఖాన్‌తో పాటు కార్యక్రమ సమన్వయ కర్త, జై ప్రకాష్ సాగర్, వక్త శ్యామ్ రహిపై కూడా కేసుల్ని దాఖలు చేసారు.అంతకు ముందు ఏప్రిల్ 24న సైతం పలు ఆరోపణల్ని చేసారు. తన నియోజవకర్గంలోని ముస్లిం ఓటర్లు తమ హక్కును చలాయించ కుండా జిల్లా యంత్రాంగం అడ్డుకుంటోందని ఆరోపించారు. ‘గత వారం రోజులుగా ముస్లింల ఇళ్లు లూటీ చేస్తున్నారు. వారిని కొడుతున్నారు కూడా. జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ ముందూ చేయి చేసుకున్నార’ని అంటూ రాంపూర్ విలేఖరుల సమావేశంలో మరో ఆరోపణ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos