దాయాది దేశంలో హిందువుల పరిస్థితి అంత దారుణమా?

దాయాది దేశంలో హిందువుల పరిస్థితి అంత దారుణమా?

దాయాది దేశం పాకిస్థాన్‌లో హిందువులు ఎంతటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో తాజాగా వెలుగు చూసింది.భారత్‌లో మైనారిటీలైన ముస్లింలు స్వేచ్ఛవాయువులతో జీవిస్తుండగా పాకిస్థాన్‌లో మైనారిటీలుగా చలామణి అవుతున్న హిందువులు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు,పాలకుల వేధింపులు,బెదిరింపులు తాళలేక చాలా మంది హిందువుల మతం మారగా మరికొంత మంది విదేశాలకు వెళ్లిపోయారు.ఈ రెండింటికి అంగీకరించిన కొంతమంది హిందువులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.పాకిస్థాన్‌లో హిందువులకు కనీసం పెళ్లిళ్లు చేసుకునే హక్కు కూడా లేదనే నిజం తాజాగా కరాచీకి చెందిన రెండు హిందూ జంటలు గుజరాత్ వచ్చి మరీ పెళ్లి చేసుకున్నఘటన రుజువు చేస్తోంది.పాకిస్థాన్‌లో పెళ్లి చేసుకునేందుకు అనుకూలమైన వాతావరణం లేకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ కు వచ్చి పెళ్లి వేడుకను చేసుకుంటున్నారు.ఎందుకిలా అంటే.. పాక్ లో నివసించే హిందువులకు పలు ఇబ్బందులు ఎదురవుతాయని.. అక్కడ డబ్బులు బాగా సంపాదిస్తున్న హిందువులు సైతం ఇబ్బందికర జీవితాన్ని అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ లో హిందువుల పెళ్లిళ్లు ఎలాంటి హంగామా లేకుండా జరుగుతాయని.. దీనికి కారణం అక్కడి పరిస్థితులేనని చెబుతున్నారు. కారణంతోనే పాక్ కు చెందిన హిందువులు భారత్ కు వచ్చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ లోని ఇతర నగరాలతో పోలిస్తే కరాచీలో ఎక్కువమంది హిందువులు నివసిస్తున్నారని.. దాదాపుగా మూడు వేలకు పైగా కుటుంబాలు ఉన్నాయని చెబుతున్నారు. పాక్ హిందువులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా మహేశ్వరి సమాజం పేర్కొంటోంది. సమాజం అధ్యక్షుడు భవేష్ మహేశ్వరి మాట్లాడుతూ.. పాక్ లో హిందూ జంటలు పెళ్లి చేసుకోవటం ఇబ్బందిగా ఉందని.. కారణంతోనే తాము రాజ్ కోటకు వచ్చి పెళ్లి వేడుకలు చేసుకుంటున్నట్లుగా చెప్పారు. ఇప్పటివరకూ పాక్ నుంచి 90 జంటలు రాజ్ కోట్ కు వచ్చి పెళ్లి చేసుకొని వెళ్లిపోతున్నారు. అయితే.. తమకు భారత్ లో ఉండే అవకాశం ఇస్తే.. తామంతా వచ్చేస్తామని సమాజంలోని పలువురు చెప్పటం గమనార్హం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos