కేజీఎఫ్‌ 2 పోస్టర్‌ 2..

  • In Film
  • January 8, 2020
  • 138 Views
కేజీఎఫ్‌ 2 పోస్టర్‌ 2..

అప్పటివరకు కర్ణాటక మినహా మరెవ్వరకీ తెలియని కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ కేజీఎప్‌ చాప్టర్‌ 1 చిత్రంతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.కేజీఎఫ్‌ మొదటి భాగం తెచ్చిన గుర్తింపుతో కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలు,తమిళనాడు,ఉత్తరాదిలో సైతం యశ్‌కు భారీస్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది.ఈ నేపథ్యంలో యశ్‌ తదుపరి చిత్రం కేజీఎఫ్‌ 2 కోసం కన్నడతో పాటు అన్ని భాషల అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా యశ్‌ పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం మరో పోస్టర్ రిలీజ్ చేసింది.తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ చిత్రంపై అంచనాలు మరింత పెంచుతోంది.చేతిలో సుత్తి పట్టుకొని యశ్‌ గంభీరంగా చూస్తున్నట్టుగా ఉన్న పోస్టర్‌  చాప్టర్‌ 2 ఎలా ఉండనుందో తెలియజేస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos