కోలుకున్న కనికా కపూర్

కోలుకున్న కనికా కపూర్

ముంబై: బాలీవుడ్ గాయకి కనికా కపూర్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంది. ఆమెకు ఆరో సారి చేసిన పరీక్షలో ఆమెకు వ్యాధి లేనట్లు తేలింది. లఖ్నవ్ సంజయ్ గాంధీ ఆసుపత్రి నుంచి ఆమెను సోమవారం విడుదల చేసారు. ఆమె పై మూడు ప్రాథమిక సమాచార నివేదికలు దాఖలయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలన్న ఆదేశాలను ఉల్లఘించడం, వైరస్ సోకినప్పటికీ నిర్లక్ష్య పూరితంగా పలు సభలు, సమావేశాలు, వేడుకలకు హాజరవడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు దాఖలు చేసారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత తనలో ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు ఇన్స్టాగ్రామ్లో తెలిసిన కనిక తర్వాత ఆ పోస్ట్ ను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పరీక్షలు నిర్వహించి పాజిటివ్ ఫలితం వచ్చే వరకు తనకు వైరస్ సోకిందన్న విషయం తెలియదని ఆమె చెప్పింది.

తాజా సమాచారం