కమల్‌నాథ్‌ పిటిషన్‌పై విచారణ.. ఈసీకి చుక్కెదురు

న్యూ ఢిల్లీ : మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ కు ‘స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తూ ఎలక్షన్ కమి షన్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు ‘స్టే’ విధించింది. ‘స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి అభ్యర్థిని తొలగించడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు. నాయకుల హోదాపై ఈసీకి నిర్ణయాధికారం ఎక్కడిది’ అని కోర్టు ప్రశ్నించింది. ఈసీకి ఆ నిర్ణయాధికారం లేనందున… కమల్ నాథ్ స్టార్ క్యాంపె యినర్ హోదాను రద్దు చేయడంపై స్టే విధిస్తున్న’ట్లు తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే నేత్రుత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కమల్ నాథ్ పిటిషన్పై సోమవారం (నవంబర్ 2) విచారణ చేపట్టింది. , బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవిని ఐటెం అని కమల్ నాథ్ వ్యాఖ్యానించటం తీవ్ర దుమారాన్ని రేకెత్తించింది. దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కమల్ నాథ్ వివరణ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ ఆయన స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేసింది. దీన్ని కమల్ నాథ్ శనివారం సుప్రీం కోర్టులో సవాలు చేసారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ను నియమించుకోవడం రాజకీయ పార్టీలకు ఉన్న హక్కు. ఇందులో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోకూడదు. ఒక రకంగా ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం లాంటిదే’ అని కమల్ నాథ్ సుప్రీంలో దాఖలు చేసిన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos