కాళికామాత వివాదాస్పద పోస్టర్ పై కేసుల నమోదు

కాళికామాత వివాదాస్పద పోస్టర్ పై కేసుల నమోదు

న్యూ ఢిల్లీ: కాళికామాత పట్ల అగౌరవాన్ని ప్రదర్శించిన ‘కాళి’ చిత్ర నిర్మాత, దర్శకురాలు లీనా మణిమేకలైకు వ్యతిరేకంగా ఢిల్లీ, యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాళికామాత పాత్రధారి సిగరెట్ తాగుతున్న పోస్టర్ ను విడుదల చేసినందుకు హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నేరపూరిత కుట్ర, దేవతల పట్ల అపచారం, మత మనోభావాలను గాయపరచడం, శాంతికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడం తదితర ఆరోపణలపై కేసులు దాఖలయ్యాయి. ఢిల్లీకి చెందిన న్యాయవాది వినీత్ జిందాల్, గో మహాసభ నేత అజయ్ గౌతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.లీనా మణిమేకలై కెనడాలో శరణార్ధిగా నివసిస్తోంది. శరణార్థి రక్షణ చట్టం కింద ఆమెకు రక్షణ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ ఇప్పటికే తన అభ్యంతరాన్ని కెనాడాకు తెలిపింది. కాళికామాతను అగౌరవంగా చూపిస్తున్న పోస్టర్లను తొలగించాలని, మణిమేకలై ఇకమీదట ఇలా వ్యహరించకుండా చూడాలని కోరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos