భూమికి చేరువగా రానున్న గురు గ్రహం

భూమికి చేరువగా రానున్న గురు గ్రహం

న్యూ ఢిల్లీ : నేటి రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురు గ్రహం భూమికి అత్యంత సమీపానికి రానుంది. శని, గురువు, భూమి మూడు ఒకే రేఖ లో కనిపించ నున్నారు. 59 ఏళ్ల తర్వాత గురు గ్రహం భూమికి అత్యంత చేరువగా రానుంది. 107 ఏళ్ల తర్వాత 2129లో మళ్లీ గురువు భూమికి చేరువగా వస్తుంది. అంటే ప్రస్తుతం భూమిపై ఉన్న ఏ ఒక్కరికీ మళ్లీ ఇలాంటి దృశ్యాన్ని చూసే అవకాశం ఉండదు. భూమికి సమీపానికి వచ్చినప్పుడు భూమి-గురు గ్రహం మధ్య దూరం 59,06, 29,248 (59.06 కోట్లు) కి.మీలు. భూమికి దూరంగా వెళ్లినప్పుడు 96,56,06,400 (96.56కోట్లు) కి.మీలు. సౌర వ్యవస్థలో అతి పెద్దదైన గురు గ్రహం భూమికి సమీపానికి వచ్చినప్పుడు. ఇంకా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనుంది. ప్రతి 399 రోజులకు ఒకసారి (13 నెలల నాలుగు రోజులు) జూపిటర్ భూమికి వ్యతిరేక దిశలోకి వస్తుంది. అప్పుడు ఆకాశంలో గురు గ్రహం ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది మంగళ వారం ఆవిష్కృతం కానుంది. సోమవారం సాయంత్రం భూమికి సమీపానికి రానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos