నిరుద్యోగ భారతం

నిరుద్యోగ భారతం

న్యూ ఢిల్లీ : భారత్లో నిరుద్యోగం నానాటికీ పెరిగి పోతోంది. గత అక్టోబరులో దేశంలో నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్ఠానికి పెరిగి 8.5 శాతానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2016 ఆగస్టు తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. సెప్టెంబరులో నిరుద్యోగరేటు 7.2 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ మంద గమనాన్ని ఈ గణాంకాలు ప్రతిబింబి స్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. కీలక రంగాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. సెప్టెంబరులో ఉత్పత్తి 5.2శాతం క్షీణించింది. దశాబ్దంలోనే ఇది అత్యంత తక్కువ . నిరుడు ఇదే నెలలో కీలక రంగాల ఉత్పత్తిలో 4.3 శాతం వృద్ధి నమోదైంది. తయారీ రంగ కార్యకలాపాలు కూడా అక్టోబరులో బలహీనంగా ఉన్నాయి. సెప్టెంబరులో మానుఫ్యాక్చ రింగ్ పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 51.4 కాగా అక్టోబరులో ఈ సూచీ రెండేళ్ల కనిష్ఠానికి తగ్గి 50.6కు పడి  పోయింది. కొనుగోళ్లు లేక పోవడంతో కంపెనీల్లో నిల్వలు పేరు కుపోయి తయారీ రంగం క్షీణించింది. దీంతో కొత్త ఉద్యోగాల కల్పన కూడా ఆరు నెలల కనిష్ఠానికి తగ్గింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos