ట్రంప్‌ ప్రకటనపై పార్లమెంట్‌ లో దుమారం

ట్రంప్‌  ప్రకటనపై పార్లమెంట్‌ లో దుమారం

న్యూఢిల్లీ: కాశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మంగళవారం పార్లమెంట్ను కుదిపేసింది. ‘ట్రంప్ను మోడీ మధ్యవర్తిగా ఉండాలని కోరారా? లేదా?తేల్చి చెప్పాలని ఉభయ సభల్లో మంగళవారం విపక్షాలు డిమాండు చేసాయి. దీని గురించి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ పార్టీ ఖాతరు చేయలేదు. ప్రధాని మోడీ యే సభలో స్పష్టీకరించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. ట్రంప్ పేర్కొన్నట్లు కాశ్మీర్ వివాదంలో అమెరికా మధ్యవర్తిత్వం కోసం మోదీ ఎన్నడూ ప్రయత్నించలేదని మంత్రి జయ శంకర్ స్పష్టీకరించారు. ఇమ్రాన్ ఖాన్తో ట్రంప్ కాశ్మీర్ కల్లోలం గురించి మాట్లాడడం అనుమానాలకు తావిస్తోందని విపక్షాలు కేంద్రాన్ని దుమ్మెత్తి పోసాయి. ‘కాశ్మీర్ సమస్య పై ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని కోరడం అంటే.. ఇది ఇండియా ఐక్య శక్తి కి పెద్ద విఘాత’మ ని కాంగ్రెస్ సభ్యుడు మనీష్తివారి వ్యాఖ్యానించారు. మోడియే స్వయంగా తన జోక్యాన్ని కోరినట్లు ట్రంప్ తెలిపారని గుర్తు చేశారు. ‘ప్రధాని మోడి సభకు వచ్చి దీని గురించి స్పష్టీకరించాలని డిమాండ్ చేశారు. ఇదే వ్యవహారం పై లోక్సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos