గిలానీ ట్వీట్‌- ఇద్దరిపై వేటు

గిలానీ ట్వీట్‌- ఇద్దరిపై వేటు

శ్రీనగర్: వేర్పాటువాద నాయకుడు (91) సయ్యద్ అలీషా గిలానీ చేసిన ట్వీట్తో ఇద్దరు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులపై వేటు పడింది. జమ్ము-కశ్మీర్కు ప్రత్యే క ప్రతిపత్ది రద్దయిన తర్వాత కేంద్రం తీవ్రమైన ఆంక్షల్ని విధించింది.సమాచార వ్యవస్థనూ స్తంభింప చేసింది. అయినా గిలానీ ట్వీట్ చేయడం కల కలాన్ని రేపింది. దీని పై విచారణ చేసిన బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికార్లు ఇద్దరు అధికార్లు గిలానీ ట్వీట్ చేయటానికి సహకరించినట్లు తేల్చారు. దీంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తినిఆగస్టు 5న రద్దు చేసింది. అంతకు ముందే -ఆగస్టు 4న మొత్తం రాష్ట్రంలో ల్యాండ్ లైన్లతో సహా, అన్ని కమ్యూనికేషన్ సౌకర్యాన్ని రద్దు చేసారు. ఆగస్టు 8న అలీషా గీలానీ కొన్ని ట్వీట్లు చేయడం దుమారం రేపింది. ఆయనకు ల్యాండ్ లైన్ ఫోన్, సామాజిక మాధ్యమం ఎలా అందుబాటులోకి వచ్చిందన్నది చర్చనీయాంశమైంది. ఆయన ట్వీట్లు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని ట్విటర్ ఖాతాను రద్దు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos