‘కేసీఆర్ కి చేతకావడం లేదు ’

‘కేసీఆర్ కి చేతకావడం లేదు ’

హైదరాబాదు : ‘కేసీఆర్ వయసు అయిపోయింది. బాధ్యతల్ని నిర్వర్తించలేక పోతున్నారు. ఏదీ చేతకావడం లేదు. అందుకే తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నార’ని కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై చూపించే శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కారంలో లేదని దుయ్యబట్టారు. ‘ఆరోగ్యశ్రీ పథకం చాలా బెటర్ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ వైపు మొగ్గు చూపారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల కోసం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ ని అమలు చేయడంలో కూడా రెండేళ్లు ఆలస్యం చేశారు. గిరిజనుల 10 శాతం రిజర్వే షన్లనూ చేయడం లేదు. గిరిజన ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోతార’ని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos