వేలానికి ప్రజా వేదిక ఫర్నీచర్‌

వేలానికి ప్రజా వేదిక ఫర్నీచర్‌

అమరా వతి:అమరావతిలోకూల్చివేసిన ప్రజా వేదికలో మిగిలిపోయిన సామగ్రిని వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది.ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల మూడో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాతి రోజు వేలం జరుగుతుంది. తెదేపా ప్రభుత్వం దాదాపు రూ.9 కోట్ల వ్యయంతో ప్రజా వేదికను నిర్మించారు. దాన్ని ప్రస్తుత ప్రభుత్వం అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చి వేసింది. తర్వాత దానిలోని ఏసీలు, కుర్చీలు, టేబు ళ్లు సహా పలు విలువైన వస్తువులను అక్కడే వదిలేసింది. ఇప్పుడు వాటిని వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. వాటి అసలు విలు వలో ఇప్పుడు పది శాతం కూడా రాదని తెదేపా సీనియర్ నాయకుడు నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. ప్రజా వేదిక కూల్చివేసిన వెంటనే ఈ పని చేసి ఉంటే కొన్ని కోట్ల రూపాయలైనా వచ్చేవన్నారు. ఇప్పుడు అందులో పది శాతం కూడా రాదని అభిప్రాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos