జూ.ఎన్టీఆర్‌కు అవకాశం ఉంది..

జూ.ఎన్టీఆర్‌కు అవకాశం ఉంది..

వైసీపీ ప్రభంజనంతో శాసనసభ,లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీలో భవిష్యత్‌ నాయకుడిపై అంతర్మథనం మొదలైంది.రెండు దశాబ్దాలుగా తెదేపాను ముందుండి నడిపిస్తున్న చంద్రబాబుకు వయసు మీద పడడడంతో వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుకు పార్టీని నడపడం కష్టం తరంగా మారింది.అదే సమయంలో చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన లోకేశ్‌బాబుకు పార్టీని నడిపించే నాయకత్వ లక్షణాలు ఏమాత్రం కనిపించకపోవడంతో తెదేపా నేతల కన్ను జూ.ఎన్టీఆర్‌పై పడింది.తెదేపా పగ్గాలను జూ.ఎన్టీఆర్‌కు అప్పగించాలంటూ కొద్ది కాలంగా డిమాండ్లు ఎక్కువయ్యాయి.ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వ్యక్తం చేయగా తాజాగా తెదేపా నేత జేసీ దివాకర్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఎన్టీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్‌ దృష్ట్యా ఇప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశిస్తే రానున్న రోజుల్లో అగ్రనేతగా ఎదిగే అవకాశం ఉందన్నారు.సీనయర్‌ ఎన్టీఆర్‌ రూపం,లక్షణాలు జూ.ఎన్టీఆర్‌కు రాజకీయాల్లో రాణించడానికి దోహదపడతాయన్నారు. సినిమావాళ్లని చూడడానికి జనాలు వస్తారు. కానీ రాజకీయంగా వారు ఎదగడం కష్టం. పవన్ కళ్యాణ్ అంతటివాడు రాజకీయాల్లోకి వచ్చాడు.. పవన్ కి ఎంతపేరు ఉంది.. కానీ రాజకీయంగా ఏమైంది అని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సరిపడరని గతంలోనే చెప్పానన్నారు.పార్టీ పెట్టే సమయంలో పవన్‌ తనవద్దకు దూతను పంపించారని అయితే పవన్‌ను చూడడానికి ప్రజలు వస్తారు కానీ పవన్‌ నమ్మి ఎవరూ రారని దూతతో చెప్పానని గుర్తు చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos