జయరాం హత్య కేసులో పోలీసులూ నిందితులు

జయరాం హత్య కేసులో పోలీసులూ నిందితులు

హైదరాబాద్‌ : పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ను సిద్ధం చేశారు. అందులో ముగ్గురు పోలీసు అధికారులను నిందితులుగా పేర్కొన్నారు. ముందే వేసుకున్న పథకం మేరకు యువతి పిలిచినట్టుగా నాటకమాడి జయరాంను రప్పించారని, తర్వాత రాకేశ్‌ రెడ్డి చిత్ర హింసలు పెట్టి ఆయనను హత్య చేశాడని వివరించారు. తదుపరి మృతదేహాన్ని తెలంగాణ సరిహద్దులు దాటించాడని పేర్కొన్నారు. మొత్తం 23 పుటల ఛార్జిషీట్‌లో 12 మంది నిందితులతో పాటు 73 మంది సాక్షుల పేర్లను ప్రస్తావించారు. నిందితులుగా రాకేశ్‌ రెడ్డి, వాచ్‌మన్‌ శ్రీనివాస్‌, రౌడీ షీటర్‌ నగేశ్, నటుడు, కమెడియన్‌ సూర్య ప్రసాద్‌, అతని స్నేహితుడు కిశోర్‌, స్థిరాస్తి వ్యాపారి సుభాష్‌  రెడ్డి, తెదేపా నాయకుడు బీఎన్‌. రెడ్డి, వ్యాపారి అంజి రెడ్డి, నల్లకుంట మాజీ సీఐ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ సీఐ రాంబాబు, ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లా రెడ్డిలను నిందితులుగా చూపించారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరిని 11వ సాక్షిగా పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos