‘నిజమే…అమ్మ మృతిపై అనుమానాలున్నాయి`

‘నిజమే…అమ్మ మృతిపై అనుమానాలున్నాయి`

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తనకూ అనుమానాలున్నాయని ఆ రాష్ర్ష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సంచల వ్యాఖ్యలు చేశారు. గురువారం శాసన సభ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని తానూ కోరానని తెలిపారు. ‘నిజమే…అమ్మ మరణం మిస్టరీలా ఉందని నేనెప్పుడో చెప్పాను. అందుకే విచారణ జరగాలని కోరాను. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఒక్కసారి కూడా నేను వెళ్లి చూడలేదు. అమ్మ మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్‌ నన్ను నాలుగు సార్లు పిలిచింది. ముఖ్యమైన పని ఉండడంతో వెళ్లలేదు. ఈసారి పిలస్తే తప్పకుండా వెళతాను` అని వివరించారు. 2016 డిసెంబరు 5న జయలలిత మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినా, దీనిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం దీనిపై విచారణకు కమిషన్‌ను నియమించడంలో జాప్యం చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు ప్రభుత్వం 2017 సెప్టెంబరులో ఆర్ముగస్వామి కమిషన్‌ను నియమించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos