అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీ హతం

అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీ హతం

వాషింగ్టన్: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లో ఆదివారం అల్ఖైదా సంస్థ చీఫ్ అల్ జవహరీని డ్రోన్ దాడిలో తుదముట్టించినట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. అమెరికా డ్రోన్ దాడిని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఖండించారు. ‘ డ్రోన్ దాడి జరిగిన మాట వాస్తవమే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అంతర్జాతీయ సూత్రా లను ఉల్లంఘించడమే’ని ఆగ్రహించారు. జవహరిని అంతాన్ని ‘విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్’గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. 11 సెప్టెంబరు 2001లో అమెరికా ట్విన్ టవర్స్పై అల్ ఖైదా జరిపిన దాడిలో దాదాపు 3 వేల మంది మరణించారు. ఈ దాడి సూత్రధారుల్లో అల్ జవహరి కూడా ఒకరని అమెరికా గుర్తించింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత ఉగ్రవాద సంస్థ పగ్గాలను జవహరి అందుకున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos