92 ఏళ్ల వృద్ధ ఖైదీని గొలుసుతో బంధించి చికిత్స

92 ఏళ్ల వృద్ధ ఖైదీని గొలుసుతో బంధించి చికిత్స

లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. జైలు శిక్ష అనుభవిస్తున్న 92 ఏళ్ల వృద్ధుణ్ని గొలుసులతో మంచానికి బంధించి చికిత్స అందించారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం కావటంతో జైలు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆ వృద్ధుడు ఈటా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. వయస్సు 92 ఏళ్లు. శ్వాస సమస్యలతో బాధపడినందున జైలు ఆసుపత్రిలో తొలుత చికిత్స చేసారు. మరింత మెరుగైన వైద్యం కోసం అలీగఢ్ ఆసుపత్రికి సిఫారసు తరలించినా పడకలు లేక పోవడంతో తిరిగి జైలు ఆసుపత్రికే తీసుకొచ్చారు. కదిలే పరిస్థితిలో కూడా లేని ఆ వృద్ధుడి కాళ్లను పోలీసులు గొలుసులతో మంచానికి కట్టేసారు. జైలు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉన్నతాధికారులు ఈటా జైలు వార్డెన్ అశోక్ యాదవ్ను సస్పెండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos