ప్రతిపక్షానికి అవకాశమిస్తున్న జగన్..

 పదేళ్ల కష్టఫలితంగా దక్కిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే మార్గాలపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాల్సిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొన్నిసార్లు ఆ దిశగా వెళుతున్నట్లు కనిపించినా జగన్‌ తీసుకునే కొన్నినిర్ణయాలు పలు అనుమానాలకు, వివాదాలకు తావిస్తున్నాయి. అందులో ఐఏఎస్‌ అధికారుల నియామకాల ప్రక్రియ కూడా ఒకటి.ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి ఆసక్తి చూపుతుండగా మరి కొందరి విషయంలో వైఎస్‌ జగన్‌ ఆసక్తి చూపుతున్నారు.కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న ధర్మారెడ్డిని తిరుమల జేఈఓగా తెచ్చుకున్న జగన్‌ మరికొందరు అధికారుల విషయంలోనూ సానుకూలంగా ఉన్నారు.గతంలో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ఆర్‌ హయాంలో గనులశాఖ కార్యదర్శిగా పని చేసిన ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి వైఎస్‌ మరణానంతరం వైఎస్‌ జగన్‌పై సీబీఐ నమోదైన కేసులకు సంబంధించి రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు.అనంతరం రాష్ట్ర విభజన జరగడంతో జైలు నుంచి విడుదలైన శ్రీలక్ష్మీ తెలంగాణ కేడర్‌కు వెళ్లిపోయారు.ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి పనిచేస్తానంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కోరారు.అందుకు సానుకూలంగా స్పందించిన జగన్ ఏపీ ప్రభుత్వంలో అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.అవినీతి ఆరోపణల కేసులో కూడా నోరు మెదపకుండా జైలు శిక్ష అనుభవించడంతో శ్రీలక్ష్మీపై సాఫ్ట్ కార్నర్ ఉన్న జగన్ ఆమెకు ఏపీ ప్రభుత్వంలో స్థానం కల్పించాలని భావిస్తున్నారు. క్రమంలో  తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర డీఓపీటీ నుండి క్లియరెన్స్ తీసుకుని ఏపీలో బాధ్యతలు చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నారు శ్రీలక్ష్మి. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్ పై ఆమె పని చేసే వీలుంది. ఇక కేంద్రం నుండి క్లియరెన్స్ కోసం వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి కూడా స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఓబులాపురం గనుల అవినీతి కేసులో రెండేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి విషయంలో జగన్ తీసుకునే నిర్ణయం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి అధికారులను ప్రోత్సహించడం ద్వారా వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎలాంటి పారదర్శక పాలన అందిస్తారు అని ప్రశ్నించడానికి తెదేపా నేతలు సిద్ధమవుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos