జగన్ కేసులో పట్టు వీడని సిట్

జగన్ కేసులో పట్టు వీడని సిట్

విజయవాడ: విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జరిగిన దాడి కేసుపై కోర్టులో విచారణ జరిగింది. విచారణకు సిట్ సహకరించడం లేదంటూ ఎన్‌ఐఏ వేసిన పిటిషన్‌పై విచారణ న్యాయస్ధానం విచారించింది. డాక్యుమెంట్లు ఎన్ఐఏకి ఇవ్వాలంటూ ఈ నెల 19న సిట్‌ను కోర్టు ఆదేశించింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. ఎన్ఐఏకి కేసు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. డాక్యుమెంట్లు ఇవ్వలేమని సిట్ కోర్టుకు తెలిపింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారమని, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, కింది కోర్టుకు అర్హత లేదని సిట్ తెలిపింది. జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన కేసులో ఎన్‌ఐఏ చేస్తున్న దర్యాప్తునకు సంబంధించి కౌంటర్‌ను దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈనెల 30లోగా దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos