కోలుకుంటున్న జాకబ్‌ మార్టిన్‌

కోలుకుంటున్న జాకబ్‌ మార్టిన్‌

టీమిండియా మాజీ క్రికెటర్‌, బరోడా మాజీ కోచ్‌ జాకబ్‌ మార్టిన్‌ ప్రమాద గాయం నుంచి కోలుకుంటున్నారు. గత నెల 27న రోడ్డు ప్రమాదంలో జాకబ్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో నెలరోజులుగా ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జాకబ్‌కు ఆర్థిక సమస్యలు తలెత్తడంతో వైద్యానికి కష్టంగా మారింది. విషయం తెలుసుకున్న టీమిండియా మాజీలు, క్రికెటర్లు, బీసీసీఐ, బీసీఏ(బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌) సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ప్రస్తుతం జాకబ్‌ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ, క్రికెటర్‌ కృనాల్‌ పాండ్య వంటి క్రికెటర్లు జాకబ్‌ పట్ల మానవత్వం చూపారు. జాకబ్‌ కుటుంబానికి గంగూలీ అండగా ఉంటూ తనవంతు ఆర్థిక సాయం చేశారు. మరో వైపు కృనాల్‌ పాండ్య ఖాళీ చెక్ ఇచ్చిన విషయం తెలిసిందే. జాకబ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి బీసీసీఐ, సీఓఏ  అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని మాజీ బరోడా ఓపెనర్‌ రాకేశ్‌ పారిఖ్‌ తెలిపారు. బీసీసీఐ రూ.5లక్షలు, బీసీఏ రూ. 3లక్షలు జాకబ్‌కు విరాళంగా ఇచ్చారు. మార్టిన్‌ వైద్య ఖర్చుల నిమిత్తం రోజుకు 70,000 ఖర్చవుతున్నాయని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos