వ్యోమగాముల కోసం చికెన్‌ చికెన్ కర్రీ,బిరియానీ..

వ్యోమగాముల కోసం చికెన్‌ చికెన్ కర్రీ,బిరియానీ..

వచ్చే ఏడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్‌యాన్‌ ప్రయోగంపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఉన్నాయి.ఇప్పటికే ప్రయోగానికి సంబంధించి పనులకు ఉపక్రమించిన ఇస్రో ఇటీవల గగన్‌యాన్‌ ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలోకి పంపించడానికి నలుగురు వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసింది.కొద్ది రోజుల క్రితం నలుగురు వ్యోమగాములకు బెంగళూరులోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ మెడిసిన్‌లో పరీక్షలు సైతం నిర్వహించిన అధికారులు ఈ నెలలో నలుగురు వ్యోమగాములను శిక్షణ కోసం రష్యా పంపించనున్నారు.ఈ నేపథ్యంలో అంతరిక్షంలో వ్యోమగాములకు అందించే ఆహారానికి సంబంధించి పనులను కూడా ఇస్రో ముమ్మరం చేసింది.అందులో భాగంగా మైసూర్లో ఉన్న డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబరేటరీ (డీఎఫ్ఆర్ఎల్) అంతరిక్ష మిషన్లో వ్యోమగాములు తినడం కోసం 22 రకాల ఆహార పదార్థాలు తయారు చేసింది. వాటిలో తేలికపాటి ఆహారం, ఎక్కువ ఎనర్జీ అందించే ఆహారం, డ్రై ఫ్రూట్స్, పండ్లు లాంటివి ఉన్నాయి. ఆహార పదార్థాలను పరీక్షించేందుకు శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు డీఎఫ్ఆర్ఎల్ పంపించింది.సంస్థ తయారు చేసిన ఆహార పదార్థాలన్నింటినీ వ్యోమగాములు ముందుగానే రుచిచూడడనున్నారు.ఎందుకంటే, వారికి అవి ఎంతవరకు నచ్చాయి అనే దాన్ని బట్టి వాటి ఎంపిక ఆధారపడుతుంది. వ్యోమగాముల కోసం శాకాహారం, మాంసాహారం రెండు రకాల ఆహార పదార్థాలూ తయారు చేశారు.అంతేకాదు అంతరిక్షంలో ఆహారపదార్థాలను  వేడి చేసుకోడానికి 92 వాట్ల విద్యుత్‌తో పని చేసే ఒక పరికరం కూడా ఇవ్వనున్నారు.ఇస్రో ఆదేశం మేరకు చికెన్ కర్రీ, బిర్యానీ,ఇడ్లీసాంబార్‌తో పాటు పైనాపిల్, పనస తదితర పండ్లు కూడా సిద్ధం చేశారు. అయితే.. ఒకసారి ప్యాకెట్ తెరిచాక, 24 గంటల్లోపు దాన్ని తినేయాల్సి ఉంటుంది. ఆహారాన్ని సగంలో అలా వదిలేయడానికి కుదరదు. మనం ప్యాకెట్ తెరవగానే అది మామూలు ఆహారం లాగే అయిపోతుంది.డీఎఫ్ఆర్ఎల్ అంతరిక్ష మిషన్ కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలన్నీ నాసా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తయారయ్యాయి. వ్యోమగాములు ఆహార పదార్థాల ప్యాకెట్ తెరిచినప్పుడు, వారి చుట్టూ ఎలాంటి సూక్ష్మక్రిములూ ఉండకూడదు.ఈ నేపథ్యంలో అందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు..

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos