భారత్‌లో దాడులకు భారీ కుట్ర

భారత్‌లో దాడులకు భారీ కుట్ర

న్యూఢిల్లీ : భారత్‌లో జైషే మహ్మద్‌, ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలు మూకుమ్మడిగా దాడులకు దిగే వీలుందని నిఘా సంస్థలు రక్షణ బలగాల్ని హెచ్చరించాయి. ఈ సంస్ధలు, పాక్ ఐఎస్ఐతో సంప్రదింపులు చేస్తున్నాయని హోం శాఖకు సమగ్ర నివేదిక పంపింది. ఆప్ఘనిస్తాన్‌లో జైషే, ఐఎస్‌ సభ్యుల మధ్య రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి పుల్వామా తరహా దాడులను ప్రోత్సహిస్తోందని అందులో పేర్కొన్నారు. ఐఎస్‌, జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను కలపడం ద్వారా భారత్‌లో భారీ కుట్రకు వ్యూహాల్ని రచిస్తున్నట్లు కనిపిస్తోందని హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. బాలాకోట్‌ వైమానిక దాడుల తర్వాత జైషే మహ్మద్ అధిపతి మసూద్‌ అజర్‌ మరో సారి క్రియాశీలంగా మారినట్లు నిఘా వర్గాలు అంచనా వేసాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos