ఈఎస్ఐ అవినీతిలో ఇద్దరు మాజీ మంత్రులకూ భాగం

ఈఎస్ఐ అవినీతిలో ఇద్దరు మాజీ మంత్రులకూ భాగం

తిరుపతి : ఈఎస్ఐ అవినీతిలో ఇద్దరు మాజీ మంత్రుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వెంక ట్రెడ్డి తెలిపారు.శని వారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లడారు.‘మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషీన్లు, టెలీ హెల్త్ సర్వీసెస్ అంశాలలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయి. టెలీ సర్వీసెస్ కాల్లిస్ట్ ఏపీది కాకుండా తెలంగాణాది ఇచ్చారు. దాన్ని పరిశీలించినపుడు అది నకిలీదిగా తేలింది. పేషెంట్స్ ఫోన్లు చేయకున్నా చేసినట్లు బిల్లులు చూపించారు. మురుగు నీటి శుద్దీకరణ కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ఆదోనిలోని ఆస్పత్రిని మార్చినా పాత ఆస్పత్రిలోని ప్లాంట్ పేరుతోనే బిల్లులు పొందారు. ఇందుకు మాజీ మంత్రి అచ్చె న్నాయుడు సిఫారసు చేశారు.నకిలీ కొటేషన్స్ పెట్టి కాంటాక్ట్ దక్కించుకున్నారు. అనవసర మందులు కొన్నారు.వాటిని వినియోగించ లేదు.చాలా ఆసుపత్రుల్లో మందులు గోదాములకే పరిమితమయ్యాయి. అవసరానికి మించి మందులు కొన్నారు. చెల్లింపుల్లో కూడా నిబంధనలు ఉల్లంఘించారు.అవినీతికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపిం చాం. మూడు నెలల పాటు విచారణ జరిపాం.గత ఐదు సంవత్సరాలలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఇందులో ముగ్గురు డైరెక్టర్లు కీలక పాత్ర పోషించారు.ఓ మాజీ మంత్రి కుమారుడి పాత్ర కూడా ఉంది. అక్రమాలకు పాల్పడ్డ వారి మీద క్రిమినల్ కేసుల నమోదుకు సిఫారసు చేశాం.వారిపై కేసులు నమోదు కావడం ఖాయం’ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos