ఐపీల్ 2020 విజేత హైదరాబాద్..

  • In Sports
  • November 3, 2020
  • 284 Views

ఇప్పటి వరకు ఏ సీజన్ లో కూడా లేని ఉత్కంఠ,మలుపులు ఈసారి ఐపీల్ లో చోటు చేసుకుంటున్నాయి.మొదటి అంచెలో అదరగొట్టిన జట్లు రెండో అంచెలో చతికిలబడగా కొన్ని అనూహ్యంగా పుంజుకున్నాయి.ఆఖరి మ్యాచ్ వరకు ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు కాకపోవడం ఇటువంటి ఎన్నో మలుపులు చోటు చేసుకుంటుండడంతో క్రికెట్ అభిమానులకు అసలు సిసలు వినోదం అందుతోంది.ఇక ఈ రోజు ముంబై ఇండియన్స్,హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ తో ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కానున్నాయి.ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ నగరానికి చెందిన మిథులా అనే ఓ యువ ఆస్ట్రాలజర్ చెప్పిన జోస్యం వైరల్ గా మారింది. 2020 ఐపీల్ లో సన్‌రైజర్స్ కప్ కొడుతుందని జోస్యం చెబుతున్నాడు. ఆ మాట చెప్పింది ఇప్పుడు కాదు.. ఐపీఎల్ ప్రారంభానికి చాలా ముందే.. జులై 27న ఈ మాట చెప్పాడు.

ఈ ఐపీఎల్‌లో సీజన్లో కోహ్లి యావరేజ్‌గా ఆడతాడని.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరవని.. రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంటుందని.. సన్‌రైజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని.. ముంబై, ఢిల్లీతోపాటు ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరుకుంటుందని జులై 27న మితుల్ అనే ఆస్ట్రాలజర్ ఓ ట్వీట్ చేశాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్‌కు చేరదని స్పష్టంగా చెప్పాడు.ఇప్పటి వరకూ తాను చెప్పిన వాటిలో నిజమైనవాటికి రైట్ టిక్ కొడుతూ.. ఇక నిజం కావాల్సింది ఇదొక్కటే అన్నట్టుగా సన్‌‌రైజర్స్ టైటిల్ గెలుస్తుంది అన్నదానికి ముందు క్వశ్చన్ మార్క్ పెట్టి తాజాగా మరో ట్వీట్ చేశాడు.మిథుల్ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అతణ్ని ఆకాశానికి ఎత్తేస్తూ.. తమ జట్టే కప్ కొడుతుందని నమ్మకంతో ఉన్నారు. కోహ్లీకి విరాభిమాని అయిన ఈ యువకుడికి ట్విట్టర్లో ఫాలోవర్లు భారీగా పెరుగుతున్నారు.మిథుల్ ట్విట్టర్ బయోలో.. ‘మోడ్రన్ డే ఆస్ట్రాలజర్, నేను అంచనా వేయను.. స్క్రిప్ట్స్ రాస్తాను’ అని ఉంది.కాగా అతడు కొన్ని ట్వీట్లలో తెలుగు పదాలు వాడటం, తెలుగులో రిప్లయ్ ఇవ్వడం కూడా గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos