ఇంటర్‌బోర్డు తీరు మారదా?

ఇంటర్‌బోర్డు తీరు మారదా?

ఇంటర్‌ ఫలితాల్లో నిర్లక్షంగా వ్యవహరించి కొంతమంది విద్యార్థులకు ఆత్మహత్యలకు కారణమైన వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకున్న ఇంటర్‌బోర్డుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.ఇంత జరిగినా తెలంగాణ ఇంటర్‌బోర్డు తీరులో ఏమాత్రం మార్పు రాలేదని తాజాగా వెలుగు చూసిన మరో ఘటనతో రుజవైంది.అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్ల జారీ విషయంలో కూడా ఇంటర్‌బోర్డు నిర్లక్షంగా వ్యవహరించింది.జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన వినోద్‌ రసాయన శాస్త్రంలో ఫెయిల్‌ కావడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి ఫీజులు చెల్లించాడు.ఈనెల 12వ తేదీ పరీక్ష రాయాల్సి ఉండడంతో హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వినోద్‌ షాక్‌కు గురయ్యాడు.కారణం ఒకే పరీక్షకు రెండు వేర్వేరు సెంటర్‌లను కేటాయిస్తూ రెండు హాల్‌ టికెట్లను జారీ చేయడమే.దీంతో ఏ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయాలో అసలు ఏ హాల్‌ టికెట్‌ తీసుకెళ్లాలో అర్థం కాక పోరపాటును గుర్తించి తనకు సరైన హాల్‌టికెట్‌ ఇవ్వాలంటూ ఇంటర్‌ బోర్డు అధికారులను కోరుతున్నాడు.నిన్నటికి నిన్న ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నా పత్రాలు మాయం కావడం నేడు ఒకే విద్యార్థికి రెండు హాల్‌ టికెట్లు జారీ చేయడంతో ఇంటర్‌ బోర్డుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos