తగ్గిన టోకు ద్రవ్యోల్బణం

తగ్గిన టోకు  ద్రవ్యోల్బణం

న్యూ ఢిల్లీ : మార్చి నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) నాలుగు నెలల కనిష్ఠానికి దిగిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం గణాంకాల్ని విడుదల చేసింది. ఫిబ్రవరిలో 2.26 శాతంగా ఉన్న ఈ సూచీ మార్చిలో 1 శాతానికి చేరింది. గత నెలలో ఆహార పదార్థాల ధరలు పడిపోవడం దీనికి కారణం. ఫిబ్రవరిలో 7.79గా ఉన్న ఆహార ద్రవ్యోల్బణ సూచీ మార్చిలో 4.91కి చేరింది. కూరగాయల ద్రవ్యోల్బణం 29.97 నుంచి 11.90కు పడిపోయింది. ఉల్లి ద్రవ్యోల్బణం మాత్రం 112.31శాతంగా కొనసాగుతోంది. ఈ గణాంకాలపై లాక్ డౌన్ ప్రభావమూ ఉందని వివరించింది.

తాజా సమాచారం