ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అస్తమయం

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అస్తమయం

అమరావతి: ప్రముఖ సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (75) గురువారం తెల్లవారు జామున నాలుగు గంటలకు హైదరాబాదులోని నివాసంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చక్కని సినిమా పాటలు రాసిన కవి, పండితుడు, కథా రచయిత, పత్రికా సంపాదకుడు అయిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మది పండిత వంశం. ఎంఎ పూర్తి చేశాక కొంత కాలం అధ్యాపకుడుగా పని చేసారు . ఆంధ్రజ్యోతి ‘ వార పత్రికలో ఉప సంపాదకుడిగా, ఆంధ్రప్రభ వార పత్రికకు సంపాదకుడిగా చాలా కాలం పని చేశారు. రెండు దశాబ్ధాల పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కార్యనిర్వాహకులు సేవలందించారు. ఎన్నో మంచి కార్యక్రమాల ప్రసారానికి దోహదం చేశారు. మంచి నాటకాలు, రూపకాలు రాయించి ప్రసారం చేయించారు. ఉత్తమ సాహిత్యాభిరుచిని పెంపొందించారు. విజయవాడ నుంచి నిజామాబాద్కు బదిలీ అయిన కొంత కాలానికి పదవి నివృతి చెందారు. శ్రీకాంత శర్మ భార్య ఇంద్రగంటి భార్య జానకీ బాల రచయిత్రి. కుమారుడు ఇంద్రగంటి మోహన క్రిష్ణ సుప్రసిద్ధ సినీ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ సమ్మోహనం ‘ సినిమాలో ‘ మనసైనదేదో ‘ ఆయన చివరి గీతం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos